లోకేష్ గారు బెదిరింపు వ్యాఖ్యల మీకు తగదు
పప్పు నాయుడు సార్థక నామధేయుడు మీరు
బీసీ మహిళలకు మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా ..
వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి
మేము వడ్డీతో చెల్లించడం పడితే మీరు ఎవరు రోడ్లపై తిరగలేరు కానీ మా సంస్కృతి అది కాదు
అనపర్తి, పెన్ పవర్ :
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు బెదిరింపు వ్యాఖ్యలు తగదు అని నాయకులు కార్యకర్తలపై పెట్టిన కేసుల విషయంలో చెల్లించడం మొదలుపెడితే కానీ ఇది మా సంస్కృతి కాదు అని తమరు పప్పు నాయుడు సార్థక నామధేయుడు మీరు వేరే వాళ్లకు పేర్లు మార్చవలసిన అవసరం లేదని వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళకృష్ణా రెడ్డి అన్నారుశుక్రవారం అనపర్తి లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిన్న నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సిపి అక్రమ కేసులు పెడుతుందని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని లోకేష్ వ్యాఖ్యానించడం ఒక బజార్ రౌడీ మాటలు తలపిస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులను కార్యకర్తలను లోకేష్ బెదిరింపు ధోరణి తో మాట్లాడారు అని ఇక్కడ ఎవరు బెదిరి పోయేది లేదని మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజా సంక్షేమం కోరుకునే మనిషి అని మీ ప్రభుత్వ హయాంలో మేము మీరు పెట్టిన అక్రమ కేసులను మేము వడ్డీ చెల్లించడం మొదలు పెడితే మీరు గాని మీ మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి గాని గతంలో హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్ప గాని వీధులలో తిరగలేరు అని అయితే మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు నేర్పిన సంస్కృతి ఇది కాదని మీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న నేరాలు-ఘోరాలు కె పోలీసులు కేసులు పెడుతున్నారు తప్ప అక్రమ కేసులు కాదు అని మీరు తెలుసుకోవాలి అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పేరు జాంబి రెడ్డిగా శాసనసభ్యులు డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి పేరు యాక్టర్ సూర్యనారాయణరెడ్డి గా నేను మారుస్తున్నాను అని మీరు మాట్లాడడం సరి కాదని మీ కుటుంబమే మహానటుల కుటుంబం అని సొంత మామఎన్టీ రామారావును ను వెన్నుపోటు పొడిచిఅతని మరణానికి కారకుడు అయ్యి మీ నాన్న చంద్రబాబు నాయుడు ప్రజల వద్ద నటిస్తే పంచాయతీరాజ్ మంత్రి గా నువ్వు చేసిన నటనలు అన్ని ప్రజలకు తెలుసు అని ఆయనను పరామర్శ చేసిన మీరు ఈ రామకృష్ణారెడ్డి కుటుంబం వల్ల దగాపడిన బీసీ మహిళను మీరు ఎందుకు పరామర్శించే లేదు అని కనీసం ఆవిడ వినతిపత్రం కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తే మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎందుకు అడ్డుకున్నారని ఇదేనా బీసీల పట్ల మీ తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని వచ్చే ఎన్నికలలో నే కాదు ఏ ఎన్నికలలో కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలలో దేవుడిగా ఉన్నారని కృష్ణా రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment