Followers

మల్కాజిగిరిలో పర్యటించిన జోనల్ కమీషనర్

 మల్కాజిగిరిలో పర్యటించిన జోనల్ కమీషనర్  

రోడ్డుపై చెత్తను తొలగించి శుభ్రత పాటించాలి

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

ప్లాస్టిక్ వాడకాన్ని నిరోదించి ప్రతి ఒక్కరూ సహకరించాలి

పెన్ పవర్,  మల్కాజిగిరి

మల్కాజిగిరి సర్కిల్ లోని ప్రధాన రహదారుల పరిశుధ్య పర్యేవేక్షణ భాగంగా మల్కాజిగిరి సర్కిల్ ప్రధాన రహదారులను పర్యేవేక్షించిన జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి. రోడ్డు పై చెత్త ఉండడతో వాటిని పరిశుద్థ కార్మికులతో తొలగించి శుభ్రత పటించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ మాట్లాడుతూ సర్కిల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంటి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్చ ఆటో టిప్పర్లకు అందజేయాలని, ప్లాస్టిక్ వాడకాని నిరోదించి ప్రతి ఒక్కరూ సహకరించాలని  ప్రజలకు సూచించారు. చెత్తను ఓపెన్ నాలాలో, చెత్త వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని జరిమానా విధించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, ఉప కమీషనర్ టి.దశరథ్, ఏఈ. ట్రాన్స్ పోర్ట్ లక్ష్మి దీపక్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...