ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చిన పోలీసుకు సమాచారం ఇవ్వాలి
ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ బంధువులు/స్నేహితులు/మీ కుటుంబ సభ్యులు ఎవరు గ్రామాల్లోకి వచ్చినా మహిళా పోలీసులు, కానీ పోలీస్ లకు తప్పకుండా తెలియచేయలని మాడుగుల ఎస్. ఐ.రామారావు అన్నారు. కరోనా తీవ్రంగా ఉన్నందున ఆంక్షలు విదించామన్నారు. షాపుల యజమానులు ఉదయం 5 గం,, ల నుండి సాయంత్రం 6 గం,, ల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు జరుపుకోవాలి. కోవిడ్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలి. ఈ ప్రతి షాపు ముందు సర్కిల్స్ వేయించాలి, శానిటయిజర్ తప్పక పెట్టాలి, మాస్క్ లేనిదే అనుమతించరాదు. మీ షాపులకు ఎంతమంది వస్తున్నారో వారి పేర్లు ఫోన్ నంబర్లు వ్రాసుకోవడానికి ఒక రిజిష్టర్ మెయింటైన్ చేయాలి. ఈ విదంగా ఎవరైనా కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న షాపు లను తాత్కాలికంగా ఒక వారం పాటు సీజ్ చేయబడును. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలు (బస్సులు/మినీ బస్సులు/ఆటోలు/కాబ్ లు) ఉన్న కెపాసిటీ కంటే సగం మందిని మాత్రమే ఎక్కించుకోవాలి. మాస్క్ తప్పనిసరి గా దరించేలా చూడాలి, శానిటయిజర్ వాడాలి. ద్విచక్ర వాహనదారులు ఒక్కొక్కరు మాత్రమే ప్రయాణించాలి.ఈ విదంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. పెళ్లిళ్లు/ఏదైనా శుభకార్యాలు చేసుకునే వారు తహశీల్దారు పోసులతో ముందస్తు అనుమతి తీసుకొని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ మాత్రమే జరుపుకోవాలి..ఎటువంటి జాతరాలు/డ్రామాలు మొదలైనవాటికి అనుమతి లేదు. కోవిడ్ పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు బయటికి రాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి. కోవిడ్ పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల ఇళ్ల వారు సహకరించాలి. అందరూ మాస్క్ ధరించండి.అవసరం అయితే తప్ప ఎవరూ అనవసరంగా బయటకు రాకండి. . పోలీసులకు) మహిళా పోలీసులు, ఎఎన్ ఎం అశా వర్కర్లకు సహకరించండి వారి పట్ల దయ కలిగి ఉండండి.సర్పంచ్ లు మీ వార్డు ప్రజలను కోవిడ్ పట్లతీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చైతన్యం చేయండి. వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. .కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలి. అధికారులకు సహకరించాలి. వారి పట్ల దయ కలిగి ఉండాలి. . అందరూ పైన చెప్పిన విదంగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి సురక్షితంగా ఉండండి..సోషల్ మీడియాలలో వచ్చిన ప్రతిదాన్ని నమ్మకండి భయపడకండి.
No comments:
Post a Comment