నాడు నేడు బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలి...
మండల పరిదిలో జరుగుతున్న అన్ని పాఠశాలలకు సంబందించి పూర్తయిన నాడు-నేడు పనుల బిల్లులను వెంటనే ఆన్లైన్ అప్ లోడ్ కార్యక్రమాన్ని చేపట్టాలని మండల విద్యాశాఖాధికారి సలాది సుధాకర్ ఆదేశించారు. స్థానిక ఎమ్మార్సీ భవనంలో శనివారం మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో నాడు నేడు పనులు పూర్తయినా బిల్లులు యాప్ లో అప్ లోడ్ చేసే విషయంలో జాప్యం చేస్తున్నారన్నారు. దానితో ఆయా పాఠశాలల్లో సయితం పనులు పూర్తికానట్టు ప్రభుత్వానికి నివేదికలు వెళుతున్నట్టు చెప్పారు. దాని దృష్ట్యా హెచ్లు వెంటనే బిల్లులు అప్ లోడ్ చేయాలన్నారు. కొన్ని పాఠశాలల్లో హెచ్ఎంలు బదిలీ అయిన కారణంగా అక్కడ బిల్లుల పెండింగు ఉందన్నారు. దానికి గానూ చార్జి అప్పగించని హెచ్ఎంలపై చర్యలు తీసుకోనున్నట్టు ఎంఈవో హెచ్చరించారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనుల ప్రగతిపై పాఠశాలల వారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి హెచ్ంలకు పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఇంకా మండల విద్యాశాఖ ఇంజనీరింగు ఆహిరి లక్ష్మణరావు పాల్గొని మాట్లాడగా మండల పరిధిలోని అందరు హెచ్ఎంలు, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment