నాచారం డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ శాంతి
తార్నాక, పెన్ పవర్నాచారం డివిజన్ లోని ప్రతి సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తున్నామని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు. డివిజన్ లోని డ్రైనేజ్ మెయిన్ లైన్ లలో లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హనుమాన్ నగర్ నుండి పనులు ప్రారంభించామని, వర్షాకాలంలోపు నాచారంలోని అన్ని డ్రైనేజ్ లలో అలాగే ఓపెన్ నాలా లలో ఉన్న పూడిక తొలగిస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్, కట్ట బుచ్చన్న గౌడ్, సంతోష్, బాలమణి, కామేశ్వరి, సువర్ణ, సుగుణాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment