వర్షకాలంలోపు నాలా పనులు పూర్తి చేయాలి - ఎమ్మెల్యే మైనంపల్లి
పెన్పవర్, మల్కాజిగిరిఈస్ట్ అనంద్ బాగ్ డివిజన్ లో వర్షకాలంలో నాలా సమస్యలతో ఇబ్బందులు ఎదురుకుంటున్న కాలనీ వాసులు, వర్షకాలంలో నాలా పోంగి కాలనీలోకి మురికినీళ్లు ప్రవేశించి దుర్వసనతో, అంటువ్యాధిలతో ఇబ్బందులు ఎదురుకున్నారు. ఇకపై అ పరిస్థితి రాకూండ శశ్వత పరిష్కరం కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనంపల్లి హన్మంతరావు షిరిడీ నాలా సమస్య పై ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ అధికారులతో టౌన్ ప్లానింగ్ అధికారుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో నాలా పనులను మెుదలు పెట్టి పనులు వేగవంతం చేసి వర్షాకాలం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి కెటిఆర్ తో ఫోన్ లో మాట్లాడి నాలా సమస్యలను వివరించారు, షీరిడి నగర్ లో నెలకొన్న సమస్యలను వేంటనే పరిష్కరించాలంటు కొరారు. మంత్రి కెటిఆర్ స్పందించి నాలా సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ లతో ఫోన్ మాట్లాడి నాలా సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, పవన్,ఎసిపి. నర్సింగ్ రావు, కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, నాయకులు పిట్ల శ్రీనివాస్, సతీష్ కుమార్,రాముయదవ్, ఉపేందర్ రెడ్డి,రావుల అంజయ్య, సాయి కుమా్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment