Followers

పాఠశాల ఉపాధ్యాయులను పక్కనపెట్టి బంధువులను ఎంపిక చేసిన ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్

 పాఠశాల ఉపాధ్యాయులను పక్కనపెట్టి బంధువులను  ఎంపిక చేసిన ఆర్యభట్ట హైస్కూల్ కరస్పాండెంట్

తొర్రూరు, పెన్ పవర్

మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట హైస్కూల్ లో 11 ఏళ్ళుగా ఉపాధ్యాయులుగా పని చేస్తున్న తమ పేర్లు తొలగించి, పాఠశాల కరస్పాండెంట్ నెలకుర్తి మధుకర్ రెడ్డి ఆయన బంధువుల పేర్లను ఆపత్కాల సమయం పథకంలో చేర్చి తమకు అన్యాయం చేశాడని, అబ్బోజు సదావేణు, మమునురి విజయ్ కుమార్, బైరు శ్రీనులు ఆరోపించారు. గురువారం డీఈఓ, కలెక్టర్ కార్యాలయంలో ఆర్యభట్ట నిర్వాహకులపై పిర్యాదు చేసిన అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ...కరోనా విజృంభిస్తున్న వేళ పాఠశాలలు మూసేయడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అపత్కల సాయంగా 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని, నిర్ణయించిందని అన్నారు. 2009 సంవత్సరం నుంచి ఆర్యభట్ట హై స్కూల్ లో అంకితభావంతో పని చేసిన తమ పేర్లు పక్కనబెట్టి, ఉపాధ్యాయ శిక్షణ పొందని, యాజమాన్యం బంధువులు అయినా మిరియాల కరుణాకర్ రెడ్డి, ఎస్. మధుసూదన్ రెడ్డి ల పేర్లు పథకానికి ఎంపిక చేశారని, ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంను, అధికారులను మోసం చేసి అర్హులైన తమకు అన్యాయం చేశారని, అన్నారు. దీంతో తనకు మరణమే శరణ్యం  అవుతుందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...