డ్రిప్ కంపెనీలకు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గం ఆభిప్రాయ పడింది. సోమవారం చిత్తూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. డ్రిప్ కంపెనీలకు బకాయిలు గా ఉన్న 1,500 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విడుదల చేయలేదన్నారు. ఫలితంగా గత సంవత్సరం జిల్లాలోని రైతులకు బిందు, తుంపర్ల సేద్యం దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం పలువురు రైతులు బిందు తుంపర్ల సేద్యం కోసం నమోదు చేసుకున్న, వారికి కూడా మంజూరు కాలేదు అన్నారు. రైతులు సొంత ఖర్చులతో బిందు తుంపర్ల శబ్దానికి మొగ్గుచూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిందు తుంపర్ల సేద్యానికి డ్రిప్ కంపెనీలకు వెంటనే బకాయిలను చెల్లించి రైతులను ఆదుకోవాల్చిందిగా కోరారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అర్ధరాత్రి అపరాత్రిలలో రైతులకు కరెంటు ఇస్తున్నారని, ఎక్కడ 9 గంటల కరెంటు రావడం లేదన్నారు. రాయలసీమకు తాగునీరు సాగునీరు అందించడానికి కోట్లాది రూపాయల వ్యయంతో 80శాతం హంద్రీనీవా పనులు పూర్తయ్యాయని చెప్పారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు హంద్రీ-నీవా పనులను ముందుకు తీసుకెళ్లకుండా కోట్లాది రూపాయలు వ్యర్థం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు .భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏనుగులతో పంట ధ్వంసం అయితే 20 సంవత్సరాల కిందట నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు. అన్నిరకాల ధరలు పెరిగిన నేపథ్యంలో అవి ఎక్కడికి చాలదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల ప్రకారం రైతులకు నష్టపరిహారం అందజేయాలన్నారు. మామిడి రైతుల పంటను ప్రభుత్వమే కిలో యాభై రూపాయల వంతున కొనుగోలు చేసి, ఫ్యాక్టరీలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ఫ్యాక్టరీలు సిండికేట్ అయి గిట్టుబాటు ధర లేకుండా రైతుల కడుపు కొడుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తీర్చాలని, రైతులకు ఎరువులు రాయితీ మీద అందజేయాలని కోరారు. డ్రిప్ ఇరిగేషన్ తిరిగి ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పైన భారతీయ జనతా పార్టీ తిరుగులేని పోరాటాలు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా నూతన కార్యవర్గం
భారతీయ జనతా పార్టీకి సమాచారం నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యులకు ముఖ్యఅతిథి సోమశేఖర్ రెడ్డి, అధ్యక్షుడు రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబులు నియామక పత్రాలను అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వడమాలపేట కి చెందిన సుబ్రహ్మణ్యం రాజు, పాలసముద్రానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు, ఉపాధ్యక్షులుగా గంగాధర నెల్లూరుకి చెందిన సేతు కుమార్ రెడ్డి, ఎస్సార్ పురానికి చెందిన సుబ్రహ్మణ్య యాదవ్, గంగవరం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం, విజయపురం మండలానికి చెందిన నారాయణస్వామి నియమితులయ్యారు. కోశాధికారిగా ఐరాల మండలానికి చెందిన హేమచంద్రారెడ్డి, కార్యదర్సులుగా గుడిపాల మండలానికి చెందిన ధనంజయ నాయుడు, పెద్దపంజాణి మండలానికి చెందిన ఉమాపతి, వెదురుకుప్పం మండలం చెందిన విశ్వనాథరెడ్డి, వీకోట మండలానికి చెందిన కృష్ణ, కుప్పం మండలానికి చెందిన సీతారాఘవులు, చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన శంకర్నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
No comments:
Post a Comment