ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి
కొడవలూరు, పెన్ పవర్
కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని మండల అధికారి సత్యవాణి సూచించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలంటీర్ లతా విధిగా వ్యాక్సిన్ను వేయించుకోవడంతో పాటు అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి వైద్యశాలకు పంపేలా చూడాలన్నారు ఎంపీడీవో జ్యోతి రెడ్డి మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం 38 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో మరింత వ్యాపించుకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి వద్ద బ్లీచింగ్ తో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడంతో పాటు వారితో సన్నిహిత సంబంధాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేయించాలన్నారు ఈ విషయం సర్పంచ్ సహకారం తీసుకొని ముందుకు సాగాలన్నారు మంగళవారం నుంచి వంద రోజుల పాటు అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం చర్యలు నిరంతరం జరగాలని ప్రభుత్వం ఆదేశించి ఉన్నందున ఈ కార్యక్రమం తప్పక అమలు చేయాలన్నారు పి హెచ్ సి వైద్య అధికారిని మయూరి మాట్లాడుతూ మాస్క్ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదన్నారు దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న వారు సైతం మాస్క్ లు లేకుండా తిరగడాన్ని హరి కట్టాలన్నారు పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు గ్రామాలలో పర్యటించి మాస్క్ ల పై జరిమానాలు విధించడం ద్వారా మాస్ ల వినియోగం పెంచాలని కోరారు ఈ సమావేశంలో తాసిల్దార్ డి వో జి వసంతకుమారి నాగరాజు సిహెచ్ వో నారాయణప్ప పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment