Followers

ఏజెన్సీలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు తెరిపించండి

 ఏజెన్సీలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు తెరిపించండి

  

పెన్ పవర్,  విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీ  ఆదివాసి ప్రాంతంలో ప్రభుత్వ  క్వరంటైన్ కేంద్రాలు   తెరిపించాలని ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో కన్వీనర్ కూడా రాధాకృష్ణ, జెఏసి సలహాదారులు  సోనియా గంగరాజు కో-కన్వీనర్ సూర్యనారాయణ, వంతల బొంజునాయుడు, అడ్వకేట్ తమర్బ ప్రసాద్ నాయుడు , ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గురువారం వారు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ ఆదివాసీ ప్రాంత ప్రభుత్వ  ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యెక చర్యలు  చేపట్టాలని అన్నారు. అదేవిధంగా  ప్రస్తుతం కోవిడ్19 (కరోనా) రెండో దశ వేగాంగా విస్తరిస్తూ అంతే వేగంగా ప్రజల ప్రాణాలను హరిస్తుంది. ఇటీవలే కాలంలో సాధారణ ప్రజలే కాకుండా విద్య వంతులు, ఉద్యోగులు, విద్యార్థులు సైతం మరణాలు పొందడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా కేసుల సంఖ్య రోజరోజుకూ పెరుగుతున్నన్నాయి.కరోనా పాజిటివ్ నిర్ధారణ కాబడిన వారికి కిట్టు చేతికిచ్చి గృహ నిర్భందం  లేదా స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు చుచిస్తున్నారు. కానీ పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో (అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి) నివసించే ఆదివాసీలకు కరోనా సోకితే గృహ నిర్భందం లేదా స్వీయ నిర్బంధం లో ఉండడానికి భౌగోళకంగా వారి ఆవాసాలు అనువుగా లేదు. వారి ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం లేదు. ఆదివాసుల నివాస గృహాలు ఒకటి లేదా రెండు గదులు మాత్రమే ఉంటుంది. అందులోనే సుమారు ఐదు నుంచి పదిమంది వరకు పిల్లలు, పెద్దలు, వయసు మళ్ళిన ముసలి వారు ఒకే ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. ఈ పరిస్థితులు అత్యంత ప్రమాకరమైన సంకేతంగా భావిస్తున్నాము. కుటుంబంలో ఏ ఒక్కరికీ కరోనా వ్యాధి సోకిన కుటుంబం మొత్తం బలి కావలసిన పరిస్థితులు ఏర్పడుతుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు, వారపు సంతలు, వ్యాపార సముదాయాలు, బయటి ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే వ్యాపారులు ఇతర ప్రజలపైన ప్రత్యేక నియంత్రణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.ఈ నెెల 26న విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం వామగడ్డ కొత్తూరు గ్రామానికి చెందిన సమరెడ్డి వైకుంఠం లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిి కరోనా తోవెళితే వైరస్ నా కుటుంబ సభ్యులకు సోకుతుందని భయపడి వర్షంలో తడుస్తూ ఆసుపత్రి బయటనే ఉండిపోయాడు. వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో (వసతి సౌకర్యాలు తగినంత లేకపోవడంతో సిబ్బంది కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది) తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ద్వారా వైద్య సేవలు పొందిన విషయం ఇదివరకే తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. రవాణా సౌకర్యాలు, సమాచార వ్యవస్థ తగినంత అందుబాటులో లేని ఏజెన్సీ ప్రాంతంలో నెలకోని ఉన్న పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుచున్నాము. ప్రభుత్వ ఆదేశాలతో నిమిత్తం లేకుండా  ప్రాజెక్ట్ అధికారి (పిఓ) వారు చొరవ తీసుకుని మొదటి దశ తరువాత మూసివేసిన  క్వారంటైన్ సెంటర్లు తక్షణమే తిరిగి తెరిపించి కరోనా వ్యాధి భాదితులకు అయా కేంద్రాలకు తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని కోరుచున్నాను. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, వైద్య సిబ్బందిని, రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో సిద్దం చేయాలని కోరుచుననాము.  ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోనియేదల ఏజెన్సీలో కరోనా వ్యాప్తికి, కరోనా ద్వారా సంభవించే మరణాలకు  ప్రభుత్వము ఐటిడిఏ అధికారులే  పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు బూడిదే మాధవ్ ,కి రసాన్ని కిషోర్, సుమన్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...