ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా చిన్నారులకు అవార్డులు అందజేసిన గొట్టిముక్కల పాండురంగారావు
కూకట్ పల్లి, పెన్ పవర్
శ్రీ సాయి ఆలేఖ్య సాంస్కృతిక సేవ వ్యవస్థపుకురాలు అరుణ నేతృత్వంలో గత 26సంవత్సరాలుగా సాంస్కృతిక సామాజిక సేవలో తనవంతు సేవాలందిస్తూ వస్తున్న అరుణకు మరియు చిన్నారి నృత్య కళాకారులకు ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు, టీజేఏసీ రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కల పాండురంగారావు అవార్డులను అందించి అభినందించారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల పాండురంగారావు మాట్లాడుతూ కళలను, కళాకారులను ప్రోత్సహించడం తనకు చాలా సంతోషంగా ఉందని, చిన్నారులు రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగి జన్మనిచ్చిన తల్లి తండ్రులకు, మన దేశానికి మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు
No comments:
Post a Comment