కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
నెల్లికుదురు, పెన్ పవర్
శ్రీరామనవమిని పురస్కరించుకుని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీ రామగిరి,చిన్న నాగారంగ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో సీతారాముల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య బుధవారం జరుపుకున్నారు. భద్రాద్రిలో సీతకు రాములవారు అభిజిత్ లగ్న ముహూర్తమున తాళి కట్టగానే సంబంధిత గ్రామాలలో సీతారాముల కల్యాణం జరిపించారు. శ్రీ రామగిరి లో శ్రీ వివేకానంద సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలోకృష్ణరాయ కళావేదికలో నిర్వహించిన శ్రీ రామ కళ్యాణం లో ఆ గ్రామ సర్పంచ్ డొనికెన జ్యోతి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ ఆదూరి సుభాషిణి,సాంస్కృతిక సమితి కార్యదర్శి ప్రజా వైద్యులు జాతీయ కళాకారులు ఆదూరి కళాధర్ రాజు,చిన్న నాగారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణ వేడుకలో సర్పంచ్ గాయపు జయపాల్ రెడ్డి, అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణదాత బొంపల్లి సోమేశ్వరరావు మాతృమూర్తి నరసమ్మ వార్డు సభ్యులు టైరు శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ రామ భక్తులు బైరు యాదగిరి గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధికార ప్రతినిధి పంజాల వాసుదేవ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ మహిళా భక్తులు కొయ్యడ శోభాయా కాంతం గౌడ్ రమప్రసాద్ గౌడ్, బైరు ఝాన్సీ అశోక్ గౌడ్, ఉడుత మంజుల సంతోష్ యాదవ్, పెద్ద గోని రామ తార వెంకన్న గౌడ్, చిర్ర బోయిన ఐలమ్మ మల్లయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.కాగా కళ్యాణ వేడుకలు కోవిడ్-19నిబంధనలు పాటిస్తూ జరిపారు.
No comments:
Post a Comment