Followers

కరోనా కారణంగా సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి

కరోనా కారణంగా సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి

తవణంపల్లి , పెన్ పవర్

   తవణం  పల్లె   మండలం లోని చెర్లోపల్లి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అమ్మాయి  సబిద 29సం,  ఆకస్మాత్తుగా   శుక్రవారం ఉదయం 11.00 గంటలకు కరోనా కారణంగా తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. ఈమె గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ ఉండడంతో క్వారంటైన్ లో ఉంటూ శ్వాసకు సంబంధిత సమస్యతో చికిత్స తీసుకుంటూ  ఆసుపత్రిలో  చేర్పించడం జరిగిందన్నారు. ఈరోజు శ్వాస పూర్తిగా స్తంభించడంతో వెంటిలేటర్ పైనే చనిపోవడం జరిగింది .ఈమె అకాల మరణానికి మండల పరిషత్ తవణంపల్లి అభివృద్ధి అధికారి , కార్యాలయ సిబ్బంది మరియు చెర్లోపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరియు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. కనుక గ్రామ సచివాలయా లలో భౌతిక దూరాన్ని పాటిస్తూ మనకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం  వ్యాక్సిన్ టికా చేయించుకుని కరోనా దరిచేరకుండా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది  , గ్రామ సచివాలయ సిబ్బంది , వాలంటీర్స్ చూసుకోవాలని మండల అభివృద్ధి అధికారిని జి. ధనలక్ష్మి  తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...