మంత్రి వనిత ఎన్నికల ప్రచారం
తాళ్లపూడి, పెన్ పవర్ఆదివారం జెడ్పిటిసి మరియు ఎంపిటిసి ఎన్నికల ప్రచారనికి విచ్చేసిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కు మండల వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల ప్రచారం రావూరుపాడు నుండి మొదలుపెట్టారు. జెడ్పిటిసి అభ్యర్థి పోశిన శ్రీలేఖ, తాళ్లపూడి మండలంలో ప్రతీ గ్రామంలోని ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రావూరుపాడు గ్రామం నుండి మొదలు పెట్టి మండలం అంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి తానేటి వనిత ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకి వేయాలని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం పెద్దేవం వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పెద్దేవం గ్రామానికి ఎంపిపి లేదని మంత్రి వనితమ్మ ఆశీస్సులతో పెద్దేవం గ్రామానికి ఎంపిపి ఇస్తున్నందుకు గ్రామ ప్రజల తరఫున మంత్రి వనితకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల వైయస్సార్సిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment