Followers

మాస్క్ ధరించకుండా గూడూరు సర్పంచ్ కంట పడకండి

 మాస్క్ ధరించకుండా గూడూరు సర్పంచ్ కంట పడకండి !


పెద్ద గూడూరు, పెన్ పవర్ 

ప్రపంచాన్ని అల్లల్లాడిస్తోన్న కరోనా వైరస్… ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. మన దేశం మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఈ విషయంలో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు నెతీ నోరూ కొట్టుకుంటున్న పరిస్థితి! అయినా కూడా వినేవాడు వింటూనే ఉండగా… వినని వారు పెడచెవిన పెట్టి అలా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా రోజు రోజుకీ స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబబాద్ జిల్లా గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్ మాస్క్ ధరించని వారికీ, ఉచితంగా మాస్క్ లను పంపిణీ చేస్తూ, వంద రూపాయల ఫెనాల్టీనీ విధిస్తున్నాడు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో మహబూబబాద్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనా నియంత్రణకు పలు చర్యలను చేపట్టారు. తాజాగా గ్రామంలో మాస్కు ధరించని వారిని జరిమానా కూడా విధిస్తున్నారు. పోలీసులు వస్తారులే, రెవిన్యూ సిబ్బంది రంగంలోకి దిగుతారులే అని చూడకుండా ఈ బాధ్యత గ్రామ సర్పంచ్ రమేష్ నాయక్  తీసుకున్నారు!  గ్రామంలో ఓ యువకుడు మాస్కు ధరించకుండా రేషన్‌ బియ్యానికి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ సర్పంచ్‌ రమేష్ నాయక్, ఆ యువకుడికి రూ.100 జరిమానా విధించాడు. అతనికీ మాస్క్ ను పంపిణి చేశాడు. మాస్క్ లేకుంటే ప్రయాణికులను ఎక్కించుకవద్దని, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, అందరు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేసాడు. కాగా ప్రజలందరూ కూడా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తేనే మహమ్మారి కరోనా ని తరిమికొట్టగలమని సర్పంచ్‌ రమేష్ నాయక్  గ్రామస్తులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతీ సర్పంచ్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే పోలీసుల పని మరింత తేలికవుతుందనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...