Followers

చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే వారిపట్ల కటిన చర్యలు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే వారిపట్ల  కటిన చర్యలు

ఎల్లారెడ్డిపేట సి ఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల ,  పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిథిలో నీ అన్ని గ్రామాలలో ప్రజలకు శాంతి భద్రతలను కాపాడటమే  ధ్యేయంగా పని చేస్తానని ఎల్లారెడ్డిపేట సి ఐ కే. మొగిలి, తెలిపారు. ఎల్లారెడ్డిపేట సి ఐ గా బదిలీ పై  వచ్చిన సి ఐ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తూనే , చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కటినంగా వ్యవహరిస్తామని  సి ఐ హెచ్చరించారు. నిషేధిత గుట్కా, గంజాయి, బెల్లం విక్రయాలను అరికడతామని  సేవించే, విక్రయించే వారిని గుర్తించి కటినంగా శిక్షిస్తామని సి ఐ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా దారులపై  కటినంగా వ్యవహరిస్తామని  అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారి పట్ల కూడా కటినంగా వ్యవహరించి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కటిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామాలలో అనుమానిత వ్యక్తులు సంచరించినా, దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి ఆచూకీ తెలిసిన నిర్భయంగా పోలీసుల కు సమాచారం ఇవ్వాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన , గ్రామాలలో  అక్రమంగా బెల్ట్  షాపులు నిర్వహించిన ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అలాగే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వున్నందున గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ప్రతి ఒక్కరూ  విధిగా  మాస్క్ ధరించాలని కోరారు. భౌతిక దూరం పాటించి కరోనా నిభందనలు  పాటించి కరోనా  కట్టడికి సహకరించాలని  సి ఐ మొగిలి,  కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...