కిటకిటలాడిన రాజన్న ఆలయం..
వేములవాడ, పెన్ పవర్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా కిటకిటలాడింది. హరిహరి నామ స్మరణతో మార్మోగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది.రాజన్నకు కోడే మొక్కు చెల్లించుకున్న భక్తులు ...అంతర ఆలయంలోని స్వామి వార్లను,అమ్మవారిని దర్శించుకుని తరించారు. రాజన్నను దర్శించుకున్న డిఎస్పి దేవారెడ్డి దంపతులు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం డిఎస్పి దేవారెడ్డి దంపతులు దర్శించుకున్నారు.అంతర ఆలయంలోని స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసుకొని సేవించారు. నాగిరెడ్డి మండపంలో దేవారెడ్డి దంపతులను అర్చక స్వాములు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment