Followers

డి సి సి బి సొసైటీ చైర్మెన్ పై చర్యలు తీసుకోవాలి

 డి సి సి బి సొసైటీ చైర్మెన్  పై  చర్యలు తీసుకోవాలి

పెన్ పవర్,  బయ్యారం

బయ్యారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో నిబంధన లకు విరుద్ధంగా జరిగిన  అవినీతి, అక్రమాలలో భాగంగా అక్రమంగా  సిబ్బందిని తొలగించి   అదనంగా కొంతమందిని విధుల్లోకి తీసుకున్న సందర్బంగా విచారణ జరిపించాలనీ మహబూబాబాద్ జిల్లా సహకార అధికారి  గారికి గంగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో  మెమోరాండం ఇవ్వడం జరిగింది. స్పందించిన జిల్లా సహకార అధికారి గారు విచారణ జరిపి చైర్మన్ మూల మధుకర్ రెడ్డి పై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు ఏనుగుల ఐలయ్య, బత్తిని రామ్మూర్తి, మండల పార్టీ కార్యదర్శి బానోత్ మురళి కృష్ణ మరియు సొందు సర్ పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...