Followers

నెలసరి సమయంలో తీసుకోవలిసిన జాగ్రత్తులు....

నెలసరి సమయంలో తీసుకోవలిసిన జాగ్రత్తులు....

మెంటాడ, పెన్ పవర్ 

 మెంటాడ మండలం జయతి గ్రామంలో జాగృతి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు మరియు కిషోర్ బాలికలకు నెలసరి సమయంలో ఎదుర్కొనే సమస్యలు, అపోహలు, నెలసరి పరిశుభ్రత, తీసుకోవలిసి జాగ్రత్తులు పై  లెప్రా సొసైటీ-జాగృతి ప్రాజెక్ట్ అధికారి  లెంక రమణ అవగాహనా కల్పించడం జరిగింది.అమెరికన్ లెప్రాసి మిషన్ ఆర్ధిక సహాయం తో నిర్వహిస్తున్న జాగృతి ప్రాజెక్ట్ కార్యక్రమం భాగంగా జయతి గ్రామంలో నెలసరి సమయంలో తీసుకోవలిసి జాగ్రత్తలు  పై అవగాహనా లో భాగంగా  లెంక  రమణ  మాటలు ఆడుతూ నెలసరి సమయం లో సానిటరీ పాడ్స్ తప్పనిసరిగా వాడాలని, కనీసం  రోజుకు 3-4 సార్లు సానిటరీ పాడ్స్ మార్చుకోవాలని. నెలసరి మహిళలలో సాధారణ పక్రియ ఎటువంటి సంకొచం కానీ బిడియం మహిళలు చర్చించకొని అవగాహనా పెంచుకోవాలిని తెలిపారు. నెలసరి సమయంలో హార్మోనులు స్థాయిలు పెరుగుతూ, తరుగుతూ ఉండటం వలన స్త్రీ మానసిక, భౌతిక స్థితి పై  ప్రభావం చూపుతుంది అని  దీని వలన కొంత మంది మహిళలో పొత్తికడుపులో నొప్పి, శరీరం ఉబ్బడం, తలనొప్పి, స్థానాలా వాపు  నొప్పి, చిన్న విషయాలుకు కోపం చిరాకు, అలసట, ఒత్తిడి కలగా వచ్చునని తెలిపారు. ఈ సందర్బంగా కరోనా పై మహిళలు అందరూ  జాగ్రత్తగా ఉండాలని, సామజిక దూరం పాటిచాలని,  ముఖానికి మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజర్ తో గాని సబ్బుతో కానీ క్రమం తప్పకుండ శుభ్రం చేసుకోవటం, జలుబు, దగ్గు వున్నవారికి దూరంగా ఉండాలని, రద్దీగా వున్నా ప్రాంతాల్లో వెళ్లకుండా ఉండటం, ముక్కు, కళ్లు, నోరు పదే పదే  ముట్టుకోకుండా ఉండాలని. తెలిపారు. ఈ కార్యక్రమంలో మొబిలైజర్ సన్యాసిరావు, బిజినెస్ మేనేజర్ చాకలి లక్ష్మి, ఆశా కార్యకర్త రాజేశ్వరి , జాగృతి కార్యకర్తలు పి.దుర్గా, ఎం. సంతోషి పాల్గున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...