వి.ఆర్.ఏ సేవలందిస్తున్న రామారావును తొలగించాలంటూ డిప్యూటీ తాసిల్దార్ సునీతకు వినతి పత్రం
సీతానగరం, పెన్ పవర్
సీతానగరం మండల కేంద్రం గల తాసిల్దార్ ఆఫీస్ నందు డిప్యూటీ తాసిల్దార్ దొండపాటి రామారావు ఎటువంటి అర్హత లేకుండానే వి.ఆర్.ఎ సేవలు అందిస్తున్న రామారావు అనే వ్యక్తిని తొలగించాలంటూ దొండపాటి.సుజానమ్మ,బొల్లిపో.పుష్ప వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే నాగంపల్లి పంచాయతీ నందు వి.ఆర్.ఏ గా కొనసాగుతున్న సనమండ్ర.ఏసురత్నంకు నలుగురు ఆడపిల్లలు ఉండగా రెండవ కుమార్తె అయిన బామ్మ కుమారుడికి మాత్రమే తమ తండ్రి అయిన ఏసురత్నం వి.ఆర్.ఎ సేవలు కొనసాగించాలని అప్పగ్గించడంపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నామని సుజానమ్మ, పుష్ప వీళ్లంతా కలిసి విలేకరుల సమావేశంలో ఆవేదన చెందారు. తమ తండ్రి వద్ద నుండి రావాల్సిన స్థలాలను పంచనీయకుండా అడ్డుపడుతూ అమర్యాదగా ప్రవర్తిస్తున్న దొండపాటి.రామారావుపై తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశామన్నారు.
No comments:
Post a Comment