కరోన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు వాడాలి.
జైపూర్ ఎసిపి జి.నరేందర్
మంచిర్యాల , పెన్ పవర్మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నరేందర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైపూర్ ఎసిపి జి.నరేందర్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, “మాస్కులు” పెట్టుకోకుండా కిరాణా షాపుల్లో, హోటళ్లలో మరియు చికెన్, మటన్ షాపుల్లో కి వచ్చే వ్యక్తులకు సరుకులు ఇవ్వకూడదని, వాహనాలలో ప్రయాణీకులతో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవరు తప్పకుండా మాస్కు కలిగి ఉండాలని అదేవిధంగా మాస్కు కలిగి ఉన్న వారిని మాత్రమే ఎక్కించు కోవాలని మరియు బహిరంగ ప్రదేశంలో షాపింగ్ మాల్ లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలని, కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని ఏసీపీ గారు చెప్పడం జరిగింది.కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని, వారి వారి గ్రామాలలో ప్రజలకు కరోన పై అవగాహన కల్పించాలని కోరారు. జైపూర్ డివిజన్ లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించినా ఇకనుండి ఎవరైనా మాస్కులు ధరించనట్లయితే చట్టప్రకారం పై కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై “188 ఐపిసి, 51(బి) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్” ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 45 సంవత్సరాలు దాటినవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి, ప్రజా ప్రతినిధులు కూడా గ్రామాలలో చాటింపు వేయాలని తెలిపారు.ఆయన వెంట శ్రీరాంపూర్ సిఐ బిల్లా కోటేశ్వర్ జైపూర్ ఎస్సై కె.రామకృష్ణ, శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్, భీమారం ఎస్సై సంజీవ్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment