Followers

ఆకుల ఆధ్వర్యంలో వైస్సార్సీపీ కి జై కొట్టిన మహిళలు

 ఆకుల ఆధ్వర్యంలో వైస్సార్సీపీ కి జై కొట్టిన మహిళలు 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

స్థానిక 16వార్డు లోని వాంబే గృహాల సముదాయం వద్ద స్థానిక  బీజేపీ నాయకురాలు  రాజేశ్వరి తో పాటుగా సుమారు 70మంది మహిళలు నగర వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ సమక్షంలో వైస్సార్సీపీ పార్టీ లోకి జాయిన్ అయ్యారు.మహిళలు అందరికి  ఆకుల సత్యనారాయణ, నగర వైస్సార్సీపీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా ఆకుల మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసి వెంకట్రావు , శెట్టిబలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను , పెంకె సురేష్ కుమార్, గణేష్  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...