కరోనా వ్యాక్సిన్ పై ఇంటింటికి అవగాహన ప్రచార కార్యక్రమము
మహారాణి పేట, పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 29వ వార్డు మహారాణి పేట లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసు కొనాలని మహిళలకు,వృద్ధులకు తెలియజేశారు.ప్రధాని మోడీ ఆదేశానుసారం భారతావనిలో నేటి వరకు రెండు కోట్ల మందికి పైగా ఈ టీకాను వేయించుకున్నారు అని అన్నారు.ఈ టీకాను అతి తక్కువ సమయంలో కనుగొన శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు.ప్రధాని ఢిల్లీలోని ఏ.ఐ.ఎమ్.ఏస్.లో టీకా వేసుకొని,ప్రజలకు మార్గ దర్శకం చేశారని,భారతావనిని కరోనా రహిత దేశముగా తీర్చిదిద్దాలని ప్రధాని కోరారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా,కార్యకర్తలు, సేవ హి సంఘటస ,ఇదే మన నిరంతర నినాదం అని అన్నారని,ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,లేనివారు, 45సంవత్సరములు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకునేలాగా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్య పరచాలని నడ్డా కోరారు.భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు పల్లా చలపతిరావు మాట్లాడుతూ వృద్ధులను ,మహిళలను వ్యాక్సిన్ వేసుకొనుట కు తీసుకు వెళ్లడానికి వాహనములను రెడీ చేశామని కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎస్.సి మోర్చా నాయకుడు చొక్కాకుల.రాంబాబు,సిహెచ్ రాజబాబు, వెంకటఅప్పారావు,గేదెల శ్రీహరి,శ్రీను,పల్లా నారాయణ రావు, ఏస్.సి.లీడర్ లీలా ప్రసాద్, పల్లా.లక్ష్మి తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని దండు బజార్ ,రామ జోగిపేట,అంగటి దిబ్బ,మొదలగు ప్రాంతములు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను గురించి ప్రచారం చేశారు.
No comments:
Post a Comment