జీవితం షడ్రుచుల సమ్మేళనం...
విజయనగరం,పెన్ పవర్జీవితం షడ్రుచుల సమ్మేళనం ఉగాది అని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని ప్లవ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు, అధికారులకు ప్రజాప్రతినిధులకు , పార్టీ నాయకులకు, మహిళలకు, కార్యకర్తలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లవ నామ సంవత్సరాలు లో ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో వెలుగొందాలని, జిల్లా అన్ని రంగాలలో పురోగతి సాధించాలని ఆయన అభిలషించారు. మరల కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కు ధరిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత ను పాటిస్తూ వైద్యుల సలహాలతో పాటు ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలన్నారు.
No comments:
Post a Comment