వదల బొమ్మాళి..
కరోనా కాటుకు తండ్రి కొడుకులు మృతి
సంతబొమ్మాలి ని కరోనా వదలను అంటుంది. జాగ్రత్తలు పాటించకుంటే! అమ్మ లేదు, నాన్న లేదు, అక్క, చెల్లి తంబి లేదు. నా దగ్గర ఎవరైనా ఒకటే. వివరాల్లోకి వెళితే కరోనా తో ఐదు రోజుల వ్యవధి లోనే తండ్రి కొడుకు మరణించిన ఉదంతం సంతబొమ్మాళి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ ఉమా పాలేశ్వర స్వామి ఆలయం ధర్మకర్తఅయిన కొండాల గణపతి రావు గురువారం రాత్రి కన్నుమూశారు. పది రోజులు క్రితం కరోనా లక్షణాలు తో గణపతి రావు తో పాటు భార్య, కుమారుడు శ్రీకాకుళం లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో చికిత్స కోసం చేరారు.అయితే ఇదే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న గణపతి రావు పెద్దకుమారుడు ఐదు రోజుల క్రితం గత శనివారం మరణించాడు.కొడుకు చనిపోయిన విషయం తండ్రి కి కుటుంబ సభ్యులు తెలియనీయలేదు . ఆవిషయం గ్రామస్తులు ఇంకా మరువక ముందే గణపతి రావు కన్ను మూయడం తో సంతబొమ్మాళి లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు మరి కొంతమంది బంధువులు పిపి కిట్లు వేసుకొని ఆయన పార్ధవ దేహాన్ని సంతబొమ్మాళి తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయం ఉన్నప్పటికీ పలువురు అభిమానులు అంత్యక్రియలు సుదూరంలో ఉండి చూసారు. గణపతిరావు గ్రామాభివృద్ధి తో పాటు దేవాలయాలు అభివృద్ధి, పూజా కార్యక్రమా ల్లో ముందుండి నడిపించే వారు. గ్రామం లో వెలసిన అతి పురాతన శ్రీ ఉమా పాలేశ్వరస్వామి దేవాలయం నుఏడాది క్రితం నుంచి లక్షలు వెచ్చించి నూతనంగా ఆలయం గా రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించి పదిమందికి ఆదర్శ oగా నిలిచారు.గ్రామ పెద్దలకు, యువకులు లకు తలలో నాలుకగా మెలిగిన గణపతి రావు ఇకలేరు అనేవిషయం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అందరూ మాస్కు ధరించి తోటివారికి సహకరిస్తారని పోలీసులు, వైద్య సిబ్బంది మరియు పాత్రికేయులు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment