Followers

రికార్డ్ స్థాయిలో రబి ధాన్యం ఉత్పత్తి

 రికార్డ్ స్థాయిలో రబి ధాన్యం ఉత్పత్తి

ఎమ్మెల్యే శంకర్ నాయక్.

మండలం లో 3కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


నెల్లికుదురు, పెన్ పవర్

దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడడానికి దాణ్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.మహుబూబాబాద్ జిల్లా  నెల్లికుదురు పిఎసిఎస్ పరిధిలోని నైనాల,నెల్లికుదురు కొనుగోలు కేంద్రాలను, శ్రీరామగిరి పరిధిలోని ఆలేరు సెంటర్ ను ఆయా సొసైటీల చైర్మన్లు కాసం లక్ష్మీ చంద్రశేఖర రెడ్డి, గుండా వెంకన్న లతో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో రబీ ధాన్యం రికార్డు స్థాయిలో పండిందని ఇందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కాలే శ్వరం తో పాటు వివిధ జలాశయాలను నిర్మించి నీటిని విడుదల చేయడమే అన్నారు.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా మోసాల నుంచిరైతులకు  విముక్తి కలుగుతుందన్నారు. అందుకే కర్షకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు రైతు బీమా 24 గంటల ఉచిత కరెంటు ప్రాజెక్టు నిర్మాణం చేసి నీటిని విడుదల చేయడం చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు.కరోనాపై మాట్లాడుతూ ..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఎవరికివారు భౌతిక దూరం స్వీయ రక్షణ మాస్కులు ధరించడం శానిటైజర్ లు వాడడం ఇళ్ళలో ఉంటూ ఫంక్షన్లకు దూరంగా ఉండడం తదితర జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు యాదగిరిరెడ్డి చింతకుంట్ల యాకయ్య బిక్కు నాయక్  రైతు బంధు సమితి జిల్లా మండల కోఆర్డినేటర్లు బాలాజీ నాయక్ వెంకటేశ్వర రెడ్డి పీఏసీఎస్ చైర్మన్లు కాశం లక్ష్మి చంద్రశేఖర్రెడ్డి గుండా వెంకన్న వైస్ చైర్మన్ భోజ్యనాయక్,టిఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పరిపాటి వెంకట రెడ్డి యాసం రమేష్, నాయకులు కాలేరు శ్రీనివాస్,గుదే వీరరన్న గౌడ్,మీడియా ఇంచార్జ్ కసర బోయిన విజయ్ యాదవ్ దండం పల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. 


 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...