మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్
వనపర్తి, పెన్ పవర్వనపర్తి జిల్లాలో ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో మిషన్ భగీరథ పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంపు గట్టు, పోచిగుట్ట, పీర్ల గుట్ట, కాసింనగర్ లో నిర్మించే వాటర్ ట్యాంక్ పనులు పూర్తి చేసి పరీక్షించడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. 98.8 కిలోమీటర్ల పైప్లైన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ డీ. మహేశ్వరరెడ్డి చంద్రశేఖర్, సీనియర్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment