Followers

రాష్ట్ర జెవివి ఉపాధ్యక్షులు మండల సత్యనారాయణ మృతి

 రాష్ట్ర జెవివి ఉపాధ్యక్షులు మండల సత్యనారాయణ మృతి

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ గ్రామానికి చెందిన రాష్ట్ర జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు మండల సత్యనారాయణ అకాల మరణాన్ని మెంటాడ గ్రామస్తులతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జెవివి నాయకులు, కార్యకర్తలు తీరనిలోటని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. మండల సత్యనారాయణ మొదట ఆంధ్రభూమి విలేకరిగా ఎన్నో సమస్యలను ఆయన కలం ద్వారా పరిష్కరించారు. అనంతరము ఆయన ఒకపక్క ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, మరో పక్క సైన్స్ ద్వారా మూఢనమ్మకాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను చైతన్యవంతులను చేశారు. సుమారు 25 ఏళ్ల పాటు ఒకపక్క ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, మరోపక్క తన జీవితమంతా పేద ప్రజల అభ్యున్నతికి, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చి తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని జెవివి వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి, జే వి వి జాతీయ కార్యదర్శి ఎన్ వి ఎస్ కృష్ణాజీ మాట్లాడుతూ సత్యనారాయణ మృతి ఆయన కుటుంబ సభ్యులకు, జన విజ్ఞాన వేదిక కు తీరనిలోటని వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యనారాయణ మాస్టర్ నిరంతరము మద్యపాన నిషేధం, ప్లాస్టిక్ సంచులు, కవర్ల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యం చేస్తూ గోనె సంచులను ఆయన అందించేవారు. సైన్సు ఉద్యమ కార్యకర్తలకు, నాయకులకు సైన్సు గొప్పతనాన్ని తెలియజేసేవారు. సత్యనారాయణ మాస్టారు ఒక గొప్ప చిత్రకారుడు. ప్రముఖ సైంటిస్టులు , జాతీయ నాయకులు చిత్ర పటాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జన విజ్ఞాన వేదిక కార్యకర్తలను, నాయకులను ఉత్తేజ పరిచే వారు. వెంటాడు మండలం, గుర్ల  గ్రామానికి చెందిన దివంగత పల్లి తిరుపతి రావు మాస్టర్ వారసుడిగా మండల సత్యనారాయణ మాస్టర్ నిరంతరము మద్యపాన నిషేధం, ప్లాస్టిక్ కవర్లు నిషేధంపై విస్తృతంగా అధ్యయనం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం సత్యనారాయణ మాస్టారు నిరంతరం కృషి చేశారు. సత్యనారాయణ మాస్టర్ కు పుట్టుకతోనే రెండు చెవులు సరిగ్గా సహకరించకపోయినా సమాజసేవలో ఆయన ఉందే ఉండేవారు. సత్యనారాయణ మాస్టారు జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం కోసం మంచి మంచి పాటలు పాడి ఆకట్టుకునేవారు. సత్యనారాయణ మాస్టర్ గురించి ఎంత చెప్పినా ఆయన చేసిన సేవలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. సత్యనారాయణ మాస్టర్ మరణించిన ఆయన భౌతికంగా బతికే ఉంటారని , ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిద్దాం.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...