ప్రయాణ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం...
బోథ్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను శుక్రవారం బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాసం అనిల్ తన తల్లి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని సమాజ సేవలో యువత ఎప్పుడూ ముందంజలో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాసం నారాయణ, మాసం అనిల్, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పి కోఆప్షన్ మెంబర్ తాహెర్ బిన్ సలాం, సిఐ నైలు, ఎస్ఐ పి. రాజు,గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్, ఎలక రాజు, వెంకటరమణ గౌడ్, ఆర్టీసీ కంట్రోలర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment