Followers

అమ్మాపురం గ్రామములో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

 అమ్మాపురం గ్రామములో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం

తొర్రూరు సిఐ కరుణాకర్ రావు

తొర్రూరు,  పెన్ పవర్

తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ గూడెల్లి సైదులు గారి తల్లిదండ్రులైనా గూడెల్లి రాములు లక్ష్మి జ్ఞాపకార్థంతో, స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం తొర్రూరు సిఐ కరుణాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... వేసవి కాలంలో గ్రామ ప్రజలకు దాహం తీర్చేందుకు, చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అన్నారు. ఈ యొక్క చలివేంద్రాన్ని గ్రామస్తులు ప్రతి ఒక్కరూ  సద్వినియోగం చేసుకోవాలని, కోరారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య,ఉపసర్పంచ్ ముద్దం వీరారెడ్డి,ఎంపీటీసీ 1 (ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు) డోనుక ఉప్పలయ్య,ఎంపీటీసీ 2 (ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి) ముద్దం విక్రమ్ రెడ్డి, వార్డ్ మెంబర్ గద్ధల శ్రీకాంత్, తమ్మెర వీరభద్రరావు, తమ్మెర విశ్వేశ్వరరావు, ముద్దం మైబూ రెడ్డి, షాట్ అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి, మిమిక్రీ గట్టు నవీన్ కుమార్, తీగల ఉపేందర్ రెడ్డి, డోనుక సైదులు,డోనుక ఐలయ్య,యాకయ్య, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...