Followers

నేడు శ్రీనివాస్ నగర్ కాలనీ ఎన్నికలు, జనరల్ బాడీ మీటింగ్ యథాతథం

 నేడు శ్రీనివాస్ నగర్ కాలనీ ఎన్నికలు, జనరల్ బాడీ మీటింగ్ యథాతథం

కాలనీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

పెన్ పవర్,  మల్కాజిగిరి 

ఏఎస్ రావు నగర్ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలను ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఆదివారం యధాతథంగా నిర్వహిస్తున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు దుడుక దశరథ్, ఎం ఎన్. చారి, ఎ ఎ. హుస్సేన్ లు తెలిపారు. శనివారం కాలనీలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ్ మాట్లాడుతూ కాలనీలోని పార్క్ నెంబర్ 1 లో ఎన్నికలతో పాటు కాలనీ సర్వసభ్య సమావేశం కూడా జరుగుతుందని తెలిపారు. కాలనీ పాత కమిటీలోని సభ్యులందరూ తమ పదవుల నుంచి వైదొలగటంతో పాటు కమిటీ కాల పరిమితి పూర్తయిన కారణంగా, సీతారాం రెడ్డి కాలనీ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని వారు తెలిపారు. కాలనీ లో సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయని పత్రికలలో ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. ఇకనైనా సీతారాంరెడ్డి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ఎన్నికల కమిటీకి సహకరించాలని వారు కోరారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నామని, కాలనీవాసులు ఐక్యమత్యంగా ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని, కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వాహణకు కాలనీ సభ్యులు సుమారు 150 మంది తమ అంగీకారం తెలిపారని వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాలనీ మాజీ అధ్యక్షుడు గూడూరు సుదర్శన్ రెడ్డి, నాయకులు ఎం మోహన్, ఎం. సాంబయ్య, జి.రమేష్, నాగు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...