దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
చెరలో ఉన్న ఎస్ ఐ ని కాల్చి చంపిన మావోలు
భాన్సీ-బచేలి మార్గంలో విశాఖ ట్రైన్ ను ఆపేసిన మావోలు
రైలు పట్టాలు తొలగించిన మావోయిస్టులు
ప్రయాణికులను ట్రైన్ దించేసిన మావోయిస్టులు
రైలు ఇంజన్ రెండు భోగిలను పల్టీ వేసిన మావోయిస్టులు
పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో శనివారం నిషేధిత మావోయిస్టులు ఘాత కానికి తెగబడ్డారు. వారి చెరలో ఉన్న ఎస్ఐ ను కాల్చి చంపారు.భాన్సీ-బచేలి మార్గంలో విశాఖ వెళుతున్న ట్రైన్ ను ఆపేశారు. ట్రైన్ ముందు పట్టాలను తొలగించారు. ట్రైన్లో ప్రయాణికులను దించేసి రైలు ఇంజన్ మరో రెండు భోగిలను పల్టీ కొట్టించారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో భాన్సీ-బచేలి మార్గంలో విశాఖపట్నం వెళుతున్న ప్యాసింజర్ రైలును మావోయిస్టులు నిలిపివేశారు. రైలు నుంచి ప్రయాణికులను దించి రైలు ముందు పట్టాలను తొలగించారు. రైలు ఇంజను రెండు భోగి లను పట్టాల నుంచి తిరగేశారు. ఈ సంఘటనకు ప్రయాణికులు హడలిపోయి ఆందోళనకు గురయ్యారు. మరోపక్క బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్( ఎస్ ఐ) తాటి మురళిని మావోయిస్టులు కాల్చిచంపారు. ఎస్సై మృతదేహాన్ని ఫుల్సుమ్ పరిధిలో వదిలి వెళ్లారు. బీజాపూర్ జిల్లా పల్నుర్ కు చెందిన తాటి మురళి గంగ లూరు సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఎస్సై సెలవుపై స్వగ్రామానికి వచ్చిన నేపథ్యంలో బుధవారం మావోయిస్టులు మురళిని అపహరించుకుపోయారు. ఎస్ ఐ ని సురక్షితంగా విడిచిపెట్టాలని కుటుంబీకులు బంధువులు మావోయిస్టులను కోరారు. అధికారులు కూడా మావోల చెరలో ఉన్న మురళి నీ విడిపించడానికి ప్రయత్నాలు షురూ చేశారు. ఇంతలో మావోయిస్టులు మురళిని హతమార్చి మృతదేహాన్ని పుల్సుమ్ ప్రాంతంలో వదిలి వెళ్లారు.
మావోయిస్టులు తమ ఉనికి చాటుకోడానికి ఈ ఘాతుకానికి తెగబడ్డారు అని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈనెల 26 జరపతలపెట్టిన భారత్ బంద్ విజయవంతం కావాలని మావోయిస్టు పార్టీ ఏవోబీ అధికార ప్రతినిధి కైలాసం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టులు తమ ఉనికి చాటుకోడానికి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆదివాసి హక్కులను హరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమానికి మావోయిస్టులు తెర తీస్తున్నారు. ఆదివాసీల ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తే స్థానిక నేతలను ప్రజాకోర్టులో శిక్షిస్తామని సిపిఐ మావోయిస్టు విశాఖ- ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ లేఖ విడుదల చేశారు. బాక్సైట్ కాల్సైట్ ఖనిజాల తవ్వకాలపై స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు వారి వైఖరి స్పష్టంగా బహిరంగం చేయాలని లేనిపక్షంలో కిడారి సోమ లకు పట్టిన గతే పడుతోందని అరుణ లేఖలో హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుతం ఏవోబీ పరిధిలో పోస్టులు ఆధిపత్య పోరుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని తిప్పికొట్టాలని పోలీస్ బెటాలియన్ లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలో ఏవో బి ప్రాంతం ఉద్రిక్త వాతావరణం సంతరించుకుంది. చీమ చిటుక్కుమన్నా ఉలికిపడే పరిస్థితి నెలకొంది. భారత్ బంద్ విజయవంతానికి మావోయిస్టులు ఎటువంటి ఘాతుక లకు పాల్పడుతారొనని ఆదివాసీలు హడలిపోతున్నారు.
No comments:
Post a Comment