ప్రభుత్వాలు ప్రకటించిన హామీలు నెరవేర్చాలి
రామగుండం, పెన్ పవర్తెలంగాణ రాష్ట్రంలో దళితులు, పేదల అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని రామగుండం పారిశ్రామిక ప్రాంత మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఇరికిళ్ల రాజనర్సు, ప్రధానకార్యదర్శి మాదాసు రామ్మూర్తి, 27 వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామగుండం తాహాసిల్దార్ రమేష్ కు జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఏప్రిల్ మాసం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహాత్ములు మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను కలుపుకొని ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాహుల్ బొజ్జా ఇచ్చిన ప్రకటనను ఈ సందర్భంగా ఖండించారు. మహనీయుల జయంతి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు కల్పించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తోందని దీనివల్ల దళితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకుని ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించడంతో పాటు, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని యువతకు ఉద్యోగ అవకాశాలు నానాటికి సన్నగిల్లుతున్న తరుణంలో పారిశ్రామిక రంగంలో ఎదుగుదలకు కుల మతాలకు అతీతంగా అందరికీ వంద శాతం సబ్సిడీతో రుణాలు అందజేయాలని దళితులకు 3 ఎకరాల భూమి అందించడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగం పెంచి అర్హులైన వారికి అందజేయాలని అన్నారు. స్థానిక పారిశ్రామిక సంస్థల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి శంకర్, కో కన్వీనర్ కాంపెళ్లి సతీష్, సలహాదారు కొంకటి లక్ష్మణ్, వైస్ చైర్మన్లు గద్దల శశిభూషణ్, పంజా అశోక్, శనిగరపు హరీష్, రాసపెళ్లి రవికుమార్, రాసూరి నర్సింగరావు, రొడ్డ సంపత్, మిడిదొడ్డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment