Followers

మండుటెండల్లో తాగునీటికి అష్టకష్టాలు

 మండుటెండల్లో తాగునీటికి అష్టకష్టాలు

వరదయ్య పాలెం, పెన్ పవర్ 

వరదయ్యపాలెం మండలం సంతవేలూరు పంచాయతీ సాతంబెడులో గుక్కెడు నీటికి జనం అల్లాడుతున్నారు. 130కుటుంబాలు గల ఈ గ్రామంలో తాగునీటిబోరు మరమ్మతులు గురై 8నెలలు అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారులకు ప్రజాప్రతినిధిలకు విన్నవించినా పలితం శూన్యమని ప్రజలు వాపోయారు. మరో బోరు ఉన్నా దాని నుంచి ఉప్పు నీరు రావడంతో ప్రజలు తాగలేక పోతున్నారు. మరో గత్యంతరం లేక ఆ గరళం నీటినే తాగుతుండటంతో  చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు శరీరంపై దద్దుర్లు దురదలు వంటి వింత వ్యాధితో బాధపడుతున్నారు.  దీంతో మండుటెండల్లో దూర ప్రాంతాలలోని వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్తితి నెలకొంది. ఈ విషయమై  దేవిక మాట్లాడుతూ బోరు మరమ్మతులకు మెకానిక్ ను పంపుతున్నట్లు తెలిపారు.  కొత్త బోరు వేయడానికి గ్రామానికి వాహనం వెళ్ళే అవకాశం లేకపోవడంతో (నూతన రోడ్ నిర్మాణంలో బాగంగా రోడ్డును తవ్వేయడం వల్ల) వేయలేక పోతున్నామని రోడ్ నిర్మాణం పూర్తి అయ్యాక కొత్త బోరు వేస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...