దుండిగల్ మున్సిపల్ పరిధిలో హరిత శుక్రవారం..
మున్సిపాలిటీ నర్సరీని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు..
హరితహారానికి కావల్సిన ముక్కలను నర్సరీలలోనే పెంచుకోవాలని అధికారులకు సూచించారు..
మున్సిపల్ పరిధిలో ఎక్కడ చెత్త కుప్పలు ఉండకూడదని సానిటేషన్ అధికారులకు ఆదేశం..
హరిత శుక్రవారం సందర్భంగా రహదారి డివైడర్ పై ఉన్న మొక్కలకు సిబ్బంది నీటి సరఫరా..
దుండిగల్, పెన్ పవర్
రాబోయే హరితాహారినికి కావలసిన మొక్కలను ముందుగానే నర్సరీల యందు పెంచుకోవాలని దుండిగల్ మున్సిపల్ కమీషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. హరిత శుక్రవారం సందర్భంగా దుండిగల్ మున్సిపల్ కమీషనర్ పి.భోగిశ్వర్లు శుక్రవారం మున్సిపల్ నర్సరీలను సందర్శించారు.ఇంటెన్సివ్ క్రిమిసంహారక డ్రైవ్ లో బాగంగా చేత్తకుప్పలు వేసే ప్రదేశాలను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని, మల్లీ చెత్తవేస్తె జరిమానాలు తప్పవని హెచ్చరించాలని అధికారులకు కమీషనర్ సూచించారు.., రహదారి వెంట వేస్ట్ ప్లాస్టిక్ మరియు పిచ్చి మొక్కలు, చెత్త కుప్పలు సిబ్బందితో తొలగించాల్సిందిగా తెలిపారు.. వార్డులలో సోడియం హైపో క్లోరైడ్ తో స్ప్రే చేయాలని, మురికి నీరు నిల్వ వుండే ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని, మాస్కులు ధరించని వారికీ 1000/- జరిమాన విధించవలసిందిగా కమీషనర్ ఆదేశించారు.. షాప్ లు, హోటల్స్, మర్కెట్లు, చికెన్ మటన్ షాప్స్, వద్ద పరిశుభ్రతను పాటించాలని, షాపులకు వచ్చేవారికి కరోన నిబంధనలు సంభందిత షాపుయజమాని సూచించే విధంగా చర్యలు చేపట్టాలని కమీషనర్ అధికారులతో వివరించారు.. ప్రతి షాపులో చెత్త డబ్బాలను ఉపయోగించాలని, చెత్తను మున్సిపల్ స్వఛ్ఛ్ ఆటోకు అందించాలని సూచించారు.. ఇష్టానుసారంగా ప్రజలు చెత్తను వేస్తున్న ఒక ప్రదేశంలో పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగించిన అనంతరం ముగ్గులు వేసి ఇచ్చట చెత్తవేసిన వారికి 500 రూపాయలు జరిమానా విధించబడును అని రాసి ఉంచారు.. ఈకార్యక్రమములో సానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సాత్విక్, మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment