ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ
మెంటాడ,పెన్ పవర్
మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మండల టిడిపి అధ్యక్షులు చలుమూరి వెంకటరావు కోరారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. మెంటాడ మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు గొర్లె ముసలినాయుడు మెంటాడ మండలంలో అన్ని గ్రామాల్లో టిడిపి పటిష్టంగా ఉందని ప్రతి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేస్తే ఎంపీపీ, జెడ్ పి టి సి స్థానాలు కైవసం చేసుకోవడం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. మాజీ వైస్ ఎంపీపీ గెద్ద అన్నవరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మెంటాడ మండలంలో స్థానిక ఎన్నికల్లో టిడిపి అత్యధిక స్థానాలు సాధిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కూడా అత్యధికంగా ఎంపీటీసీలు గెలవడమే కాకుండా, జడ్పిటిసి కూడా గెలుస్తామని, కార్యకర్తలు , అభిమానులు అధైర్య పడవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment