Followers

మాజీ మంత్రి యతి రాజారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

 మాజీ మంత్రి యతి రాజారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

వడ్డె కొత్తపల్లి సర్పంచ్ ప్రవీణ్ రావు.

పెద్దవంగర, పెన్ పవర్

జీవిత చర మాంకం వరకు ప్రజా సేవ లోనే తరించిన మాజీ మంత్రి యతి రాజారావు ఆశయ సాధనకు ప్రజలు కంకణ బద్ధులు కావాలని, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ వడ్డె కొత్తపల్లి సర్పంచ్ నెమరు గొమ్ముల ప్రవీణ్ రావు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో శైలా రావు ఆధ్వర్యంలో నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు జన్మదిన వేడుకలు గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీమంత్రి యతి రాజారావు విగ్రహానికి పూలమాల వేసిన ప్రవీణ్ రావు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సన్నిహితులు, గ్రామస్తుల సమక్షంలో కేక్ కట్ చేసి, వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి, గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ... వడ్డెకొత్తపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వడ్డె కొత్తపల్లి మట్టికి మహత్యం ఉందని, ఈ గ్రామం అందించిన యతి రాజారావు వంటి దిగ్గజ నాయకులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. యతి రాజారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తాను గ్రామ క్షేమం, అభివృద్ధి కోసమే చిన్న పదవి లోనూ ఒదిగి పోయానన్నారు. యతి రాజారావు వంటి రాజకీయ భీష్మున్ని అందించిన గ్రామానికి సేవ చేసేందుకే సర్పంచి గా గెలిచి నిలిచానన్నారు. ప్రజా సేవ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రజల అభిమానం చూరగొన్నానన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నెమరుగొమ్ముల కుటుంబం ప్రజా సేవలోనే తరిస్తుందని గుర్తు చేశారు. ప్రతి జన్మదిన వేడుక గ్రామస్తుల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.  గ్రామంలో అంతర్గత రహదారులు, మంచినీరు, వీధి దీపాలు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక వంటి సౌకర్యాలు ప్రజల మద్దతుతో అందుబాటులోకి రావడం ఆహ్వానించదగిందన్నారు. శైల రావు వంటి యువతరం సామాజిక సేవకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...