ఒలా,ఊబర్ డ్రైవర్సగా పనిచేస్తున్న వారిని ఉద్యోగులుగా గుర్తించాలి సి.ఐ.టి.యు
మహారాణి పేట, పెన్ పవర్
ఒలా,ఊబర్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలి సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఒలా ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.ధర్నాను ఉద్దేశించి విశాఖ క్యాబ్ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి.జగన్ మాట్లాడుతూ ఓలా ఉబర్ లో పనిచేస్తున్న డ్రైవర్ల దగ్గర 35% కమిషన్ తీసుకుంటున్నారు. జిఎస్టి లో అత్యధికంగా 28 శాతం మాత్రమే,దానికి మించి వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి కానీ కిలోమీటర్ కి చిన్న కారు ఐదు రూపాయలు పెద్ద రూపాయలు 8రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, బయట మార్కెట్లో చిన్న కారు కి పది రూపాయలు పెద్ద కార్ కి 13 రూపాయలు ఇస్తున్నారు డ్రైవరు 10 నుంచి 15 లక్షలు ఫైనాన్స్ కి కారు తీసుకుని నడుపుతుంటే కనీసం ఫైనాన్స్ తీరే విధంగా కూడా ఓలా ఉబర్ వచ్చే డబ్బు సరిపోవడం లేదు.ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా వాళ్ల యాప్ ఇవ్వడంతో 30 శాతం కమిషన్ తీసుకోవడం దుర్మార్గం.అలాగే గత రెండు రోజుల నుండి వాళ్ల ఇస్తున్న ఇన్సెంటివ్ కూడా తీసివేయడం దుర్మార్గం. ఇప్పుడు వస్తున్న అన్నీ కరోనా పేషెంట్ తీసుకెళుతున్న ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఎగ్గొట్టడం సరైంది కాదు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మంత్రి జోక్యం చేసుకొని వాళ్ల సమస్యలు పరిష్కారం చేయాలి లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం.ఈ కార్యక్రమంలో లో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ రాములు అప్పలరాజు రాయుడు ప్రొఫైల్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment