వరదయ్యపాలెం జడ్పీహెచ్ స్కూల్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభం
వరదయ్య పాలెం, పెన్ పవర్
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచాలని యోచనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ని స్థానిక వరదయ్యపాలెం ఎస్సై పురుషోత్తం రెడ్డి,అబ్దుల్ మునాఫ్ ఎస్ బి ఐ మేనేజర్, తంగవేలు ఎస్బిహెచ్ మేనేజర్ల చేతుల మీదగా ప్రారంభించారు.ఈసందర్భంగా ఎస్ఐ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థుల మేధాశక్తి పెంపొందించేందుకు మరియు వారిలో సృజనాత్మకత వెలికితీసేందుకు ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని తెలిపారు.
20 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ల్యాబ్ ని ప్రారంభించామని ప్రస్తుతం 10 లక్షల రూపాయలతో పరికరాలను ఏర్పాటు చేశామని అలాగే ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కింద రెండు లక్షల రూపాయలు అందుతాయని అటల్ ఇంచార్జ్ కందేరి మేఘనాధ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిణి సరస్వతి, ప్రధానోపాధ్యాయులు మోహన్ బాబు, పేరెంట్స్ కమిటీ ఛైర్పర్సన్ శారద. , కమిటీ మెంబెర్లు ప్రభావతి , దాత ఇనుప రాజేంద్ర, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment