కరోన పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి
ఆర్ డి ఓ కొమురయ్య.
చిన్నగూడూరు, పెన్ పవర్
మహుబూబాబాద్ జిల్లా స్థానిక మండల కేంద్రమైన చిన్నగూడూరు గ్రామంలోని శనివారం నాడు కరోన పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహుబూబాబాద్ ఆర్ డి ఓ కొమరయ్య అన్నారు. గ్రామంలోని కరోనా బాదిత కుటుంబాలను సందర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు తమ ఇళ్లలోనే ఉంటూ వైద్యుల సూచనలను మరియు వారు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండ వాడాలని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించాలన్నారు. కోవీడ్ పేషెంట్స్ ఐసోలేషన్ కొరకుస్థానిక జెడ్ పి ఎస్ హైస్కూల్లో మూడు రూములు సిద్ధం గా ఉంచామని వైద్య ఆరోగ్య సిబ్బంది కరోనా బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు . మండలంలోని ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయో స్థానిక తహసిల్దార్ గారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలందరూ మాస్కులు, శానిటైజర్, వాడాలి భౌతిక దూరంను పాటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కోమల, ఎంపీడీవో సరస్వతి,ఆర్ ఐ వెంకన్న, వీఆర్వో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment