సిసి డ్రైనేజ్ కి భూమి పూజ...
ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో అన్ని వార్డులను అభివృద్ధి చేస్తాం
మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు
వేములవాడ, పెన్ పవర్
14 వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరైన 2లక్షల రూపాయలతో 11వ వార్డులో గురువారం కౌన్సిలర్ యాచామనేని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీసీ డ్రైనేజ్ కు మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి- రాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారం తో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు.అనంతరం కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాస రావు మాట్లాడుతూ 11 వ వార్డు శరవేగంగా విస్తరిస్తోందనీ , వార్డు లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు . బడ్జెట్ లో 11 వ వార్డుకు ఎక్కువ నిధులు కేటాయించాలని చైర్మన్ ను కోరారు. రానున్న రోజుల్లో 11 వ వార్డు గల్లీ గల్లీ కి సి.సి రోడ్డు, డ్రైనేజీ, త్రాగు నీరు సదుపాయం కల్పించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని కౌన్సిలర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, ఏ ఈ నరసింహ స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్,14 వార్డ్ కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు పీర్ మహమ్మద్, కొండ కనకయ్య, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment