Followers

ఏబీవీపీ ఆద్వర్యంలో

 ఏబీవీపీ ఆద్వర్యంలో....

 బేల, పెన్ పవర్

కాకతీయ విశ్వవిద్యాలయం కు చెందిన నిరుద్యోగి బోడ సునీల్ మృతికి నిరసనాగా బేల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సునీల్ మృతికి  కారణం తెలంగాణ ప్రభుత్వమే అని సునీల్ మృతికి బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సునీల్ కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోన్నారు. ఈ సందర్భంగా  ఏబీవీపీ జిల్లా  ఎస్ ఎఫ్ డి  కన్వీనర్ మడవార్ హరీష్ మాట్లాడుతూ కెసిఆర్ నీచపు రాజకీయాలో  ఒక నిరుద్యోగి  బలి ఆవ్వడం జరిగిందన్నారు.తెలంగాణ సాధించుకుంది ఉద్యోగాల కోసం నిరుద్యోగం పోవాలని ఆ రోజు ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అదే నిరుద్యోగులు మళ్ళీ ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తుందన్నారు.  దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం ఇకనైనా సిగ్గు తెచ్చుకొని నిరుద్యోగులని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే సునీల్ కుటుబం లో ఒక్కరికీ  గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుబంనీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఏబీవీపీ మండల అద్యక్షుడు ఓం ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజన్లవార్ సునీల్ , మనోజ్, అజయ్, సాయి, ప్రీతం, వికాస్, అభిషేక్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...