Followers

కరెంట్ లైన్ వేసిన కూలి డబ్బులు ఇప్పంచాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్

కరెంట్ లైన్ వేసిన కూలి డబ్బులు ఇప్పంచాలని ఆదివాసీ గిరిజనులు డిమాండ్

పెన్ పవర్, విశాఖపట్నం

కొండపైకి కరెంట్ స్తంభాలు మొయించారు. గోతులు తీయించారు.వైర్లు లాగించారు.కానీ కూలి డబ్బులు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదని ఆదివాసీ గిరిజనులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికార్లు కాంట్రాక్టర్ తమ కూలి ఎగ్గొట్టారని మీరైనా దయతలచి చేసిన పనికి కూలి ఇప్పించి ఆదుకోవాలని ఏపి ఈపిడిఎల్ సి.ఎం.డికి గిరిజన కూలీలు వేడుకుంటున్నారు. డి.డి.జి/ఎస్. ఏ.ఎస్. హ్యాబి టేషన్ కింద 300 కరెంట్ పోల్స్ గోతులు తవ్వడానికి  స్తంభాలు మోయడానికి. స్తంభాలు పాతడానికి కరెంటు వైర్ లాగే పనులు తమచేత చేయించారు.డబ్బులను చెల్లించకుండా రెండేళ్ళుగా తిప్పుతున్నారని గిరిజనులు విచారం వ్యక్తం చేశారు. జి మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ పరిధిలో. ఆకుతోట. నెయ్యి బంధ. జర్రయ్  సీత బంద మిట్ట మామిడి. బొడ్డు మామిడి ఆదివాసీ గిరిజన గ్రామాలకు 2018-19 సంవత్సరంలో విద్యుత్ సౌకర్యం  కొత్త గా ఏర్పాటు చేయడం జరిగింది.

 ఈ విద్యుత్ లైన్ పనుల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను ఉపయోగించాలి.కానీ అధికార్లు కాంట్రాక్టర్ కూలి చెల్లిస్తామని చెప్పి  స్థానిక గిరిజనులను ఉపయోగించుకున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ విద్యుత్ అధికారులు కుమ్మక్కై  కూలీడబ్బులు స్వాహా చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలు అవుతున్న  200 మంది రెండు నెలలపాటు శ్రమ చేసాము. 300 స్తంభాలు ఎనిమిది కిలోమీటర్లు బుజాన మోసుకుని తరలించాము.గొయ్యి ఒక్కంటికి ఐదు మీటర్లు లోతుగా 300గోతులు తవ్వకాలు చేశాము. మోర్ట్ గేజ్. కరెంట్ వైరు లాగటానికి. 200 మంది రెండు నెలల పాటు కష్టపడి పనులుచేశామన్నారు.గ్రామాలకు కొత్త గా కరెంటు వెలుగులు వచ్చాయి. కానీ కాంట్రాక్టర్ విద్యుత్ అధికారులు బిల్ వచ్చిన వెంటనే కూలి డబ్బు లు చెల్లిస్తామని మమ్మల్ని నమ్మించారని కానీ నేటికీ రెండు సంవత్సరాలు అవుతున్న మా కూలీ డబ్బులు ఇవ్వలేదని కూలీలు వాపోతున్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధుల నుండి సోలార్ వేసిన స్థానంలోనే  కొత్తగా 256 గ్రమాలకు  విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈపధకం కోసం విద్యుత్ శాఖ నుండి 32 కోట్ల రూపాయల 256 నిధులు 3సంవత్సరం క్రితం మంజూరు చేసింది. ఐదు మీటర్ల గొయ్యి తవ్వి  ఒక విద్యుత్ స్తంభం మొసి తెచ్చి పాతి కరెంట్ వైరు లాగితే నాలుగు వేలు కూలి చెల్లించాలి. కానీ గిరిజనులు చేసిన పనికి కూలీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. గిరిజన సంఘం నాయకులు వరప్రసాదు గిరిజన సంఘం జిల్లాఉపాధ్యక్షులు పాండు చంద్రయ్య సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...