Followers

జక్కువ లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

 జక్కువ లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

మెంటాడ ,పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని గురువారము సర్పంచ్ అచ్చిరెడ్డి సత్యవతి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని ముందుగా కూర కల వీధిలో సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని పారిశుద్ధ్య కార్మికులు మట్టిని తొలగించి శుభ్రం చేయడం తో కురకాయల వీధుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులకు కోవిడ్ 19 అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత, పరిశుభ్రత పాటించాలని , అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, ప్రస్తుతము అడపాదడపా వర్షాలు కురవడంతో  ప్రజలంతా శుభ్రత, పరిశుభ్రత పాటించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...