మాస్క్ కట్టు కరోనాను తరిమి కొట్టు
నార్నూర్, పెన్ పవర్గాడిగూడా మండల కేంద్రంలో లోకారి (కే ) మార్కెట్ లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మాస్క్ కట్టు కరోనా వైరస్ ను తరిమి కొట్టు అంటు స్థానిక సర్పంచ్ మెస్రం దేవరావు, పంచాయతీ సెక్రటరీ రవి అన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతం నుంచి మార్కెట్ కు వస్తున్న ప్రజలకు కోవిద్ 19 గురించి అవగాహనా కలిపిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, మాస్క్ లేనిచో రు.500 జరిమానా గ్రామపంచాయతి కు కట్టాలని కొంరాంభీమ్ వద్ద కార్యక్రమం ను నిర్వహించారు. రాక పోక వాహన దారులను నిలిపి జరిమానా విధించారు. వారివెంట ఎంపీటీసీ సిడం నాగోరావ్, సమాచారంచట్టం హక్కు మండల అధ్యక్షుడు మడవి చంద్రహరీ, ఇంద్రాబాన్, గ్రామ పటేల్ భీంరావు, కొంరాంభీమ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు వ్యాపార వేతలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment