Followers

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

 ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి..సింగిరెడ్డి శిరీష రెడ్డి

పెన్ పవర్, కాప్రా 

 ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో  కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించడం తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.   కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ పరిధిలోని హైటెన్షన్ రోడ్డులోని శ్రీనివాస్ నగర్, అరుల్ కాలనీ, ప్రశాంతి నగర్, పలు కాలనీలలో  హైడ్రో క్లోరొక్వీన్  ద్రవ్యాన్ని పిచికారి చేయించారు. ఈ ఎస్ రావు నగర్ డివిజన్ లోని  ప్రధాన రహదారులు, బస్ స్టాప్ ల వద్ద  హైడ్రోక్లోరొక్వీన్ ద్రవ్యం తో పాటు  బ్లీచింగ్ పౌడర్ వేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ   రెండవ దశ కరోనా వ్యాధి వేగంగా వ్యాపిస్తూన  నేపథ్యంలో కాలనీలలో పరిశుభ్రత పై  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, కరోనా కేసులు ఎక్కువ అవుతున్నందున ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి, తప్పనిసరిగా మాస్కులని ధరించాలి. వీలైనంత వరకు బయటికి రాకుండా, స్వీయ నియంత్రణతో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజలు సహకరించాలన్నారు. అలాగే 45 సంవత్సరాలు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్  తీసుకోవాల్సిందిగా ప్రజలకు  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజి రెడ్డి, నాయకులు బొజ్జా రాఘవరెడ్డి, మధుకర్ రెడ్డి, అల్లూరయ్య,  ఎస్ ఏ రహీం,  బండి సాయి, నాగు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...