ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు
కళ్యాణి ఖని, పెన్ పవర్సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఈపి ఆపరేటర్ ల ఎంపిక పరీక్షకు మందమర్రి ఏరియాల్లో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ఆద్వర్యంలో ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల నుండి 206 మంది ఉద్యోగులు ఈపి ఆపరేటర్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారని, సింగరేణి యాజమాన్యం ఉత్తర్వుల ప్రకారం వీరందరికీ ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఏప్రిల్ 5,6,7 తేదీలలో ఉదయం 5 గంటల నుండి ఎంపిక పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో ఏప్రిల్ 3 నుండి 7వ తేదీ వరకు మైదానం మూసివేయడం జరుగుతుందని,ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం రామ్మోహన్, ఏరియా ఇంజనీర్ ఏజిఎం జగన్మోహన్ రావు, ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్,ఏరియా వర్క్ షాప్ డిజిఎం నరసింహరాజు, డివైపిఎం శ్యాంసుందర్, సివిల్ ఈఈ జయప్రకాష్, సీనియర్ పిఓ సత్యబోస్, వర్క్ షాప్ ఎస్ఈ ప్రభాకర్, ఎస్ అండ్ పిసి ఎస్ఎస్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment