మాడుగుల లో భారీ గిరినాగు హాల్ ఛల్..
వి.మాడుగుల, పెన్ పవర్మాడుగులలో భారీ గిరి నాగు హల్ చల్ చేసింది. నూకాలమ్మ పండగ హడావిడి లో హఠాత్తుగా గిరి నాగు ప్రత్యక్షం కావడంతో ప్రజలు హడలిపోయి పరుగులు తీశారు. స్నేక్స్ క్యాచర్ గిరి నాగుని బంధించడం తో జనం ఊపిరి పీల్చుకున్నారు. కొత్త అమావాస్య సందర్భంగా స్థానిక నూకాలమ్మ కాలనీలో వెలసిన శ్రీ నూకాలమ్మతల్లికి పండగ నిర్వహిస్తున్నారు. మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు ఉదయం నుంచి ఆలయం వద్ద బారులు తీరారు. జనం క్యూలో ఉన్న సమయంలో ఆలయం వెనుక భాగంలో షగిరి నాగు ప్రత్యక్షమై హల్ చల్ చేసింది. ఇది గమనించిన ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. స్నేక్స్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో స్నేక్స్ క్యాచర్ వెంకటేష్( కిల్లర్) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేష్ వచ్చి భారీ గిరి నాగిని బంధించారు. భారీ గిరి నాగుని పాఎస్ షడేరు ఘాట్ లోని అడవిలో విడిచిపెట్టారు. అరుదైన జాతికి చెందిన గిరి నాగులు ఇటీవల అక్కడ అక్కడ వస్తున్నాయి పాములు విష జంతువులు అయినప్పటికీ చంపటం నేరమని ఎక్కడైనా పాములు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజేష్ చెప్పారు.
No comments:
Post a Comment