Followers

ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది న్యాయమైన డిమాండ్స్ యాజమాన్యం నెరవేర్చాలి

 ప్రభుత్వ ఆసుపత్రి  శానిటేషన్ సిబ్బంది న్యాయమైన  డిమాండ్స్  యాజమాన్యం నెరవేర్చాలి

రాజమహేంద్రవరం, పెన్ పవర్

రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు ఎగిల్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పద్దతి పై  పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది వారు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ మాకు సారి అయినటువంటి ఉద్యోగభద్రత లేదని, సరి అయిన సమయానికి జీతాలు అందడం లేదని, కోవిడ్ ఆసుపత్రి గా, ప్రత్యేక వార్డ్ నందు పనిచేసే,ఆయాలుగా, శానిటేషన్ సిబ్బందికి మాస్క్ లు, శానిటేజర్లు , గ్లౌజ్ లు, బూట్లు మొదలగు రక్షణ పరమయినా పరికరాలు,సౌకర్యాలు, అందించడం లేదని, ఇల్లు గడవక దిక్కు తోచని పరిస్థితి లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రభుత్వఆసుపత్రి కోవిడ్ ప్రత్యేకవార్డ్ నందుపని చేస్తున్నామని, తమభాదను యాజమాన్యం పట్టించుకోవడం లేదని తమగోడును తెలిపారు.

గవర్నమెంట్ హాస్పిటల్స్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కురువెల్లా భానుచందర్ మాట్లాడుతూ కరోనాసమయంలో తీవ్రమయినా ఇబ్బందులకు గురి అయ్యమని, ఇప్పుడు కూడా రోజు రోజుకి కేసులు పేరుగు తున్నాయని, ఆసుపత్రి వార్డ్ల నందు పని చేయుటకు సరిపడా సిబ్బంది కొరత ఏర్పడిందని 75 మంది పని వత్తిడి భారం మా 60 మంది పై పడుతుంది అని,అందువలనపని ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి శానిటేషన్ సిబ్బంది గురి అవుతున్నమని, ఇది వరకే తమసిబ్బందిలో ఒకరు ఆసుపత్రి నందు పని చేస్తున్నటువంటి  సమయం లో కరోనా (కోవిడ్ -19)కు గురై మృతి చెందారని, మృతి చెందిన వ్యక్తి కి ఎటువంటి సహాయం యాజమాన్యం నుండి కానీ, ప్రభుత్వంనుండి కాని అందలేదని, రాను రాను కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని తమపై యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ అలసత్వం వహించా కుండ తమకు నిర్ణిత సమయానికి జీతాలు అందేలా, ఆరోగ్య పరమయినా వ్యక్తిగత భద్రత మాకు కల్పించాలని వారు డిమాండ్లు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...