బాలికలను కంటి రెప్పలా కాపాడుకుందాం.
బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం ....అధికారులు
నెల్లికుదురు , పెన్ పవర్
సృష్టికి రూపకర్త స్త్రీ,జాతి అభివృద్ధికి మరియు మానవ జాతి మనుగడ కోసం బాలికలను సంరక్షించుకుందామని తహసీల్దార్ అనంతుల రమేష్ కుమార్ ,సిడిపిఓ హైమావతి ఐ సి పి ఓ కమలాకర్ స్పెషల్ ఆఫీసర్ బాలరాజు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఎస్సై పత్తిపాక జితేందర్ లు అన్నారు. మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లోని స్థానిక మండల పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం ఐసిడిఎస్, చైల్డ్ లైన్ ల ఆధ్వర్యంలో సిడిపిఓ హైమావతి అధ్యక్షతన నిర్వహించారు.దీనికి వారు హాజరై మాట్లాడుతూ మహిళలను రక్షించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా ఎదుగుతున్నారని అయినా ఇంకా వారిపట్ల వివక్ష కొనసాగించడం దారుణమన్నారు.బాల్య వివాహాలకు పాల్పడుతూ బాలికల జీవితాలను బలిపశువులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా తమ దృష్టికి తేవాలని వారు సూచించారు.మానుకోట జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం మహిళలు ఎనిమిది వందల ఎనబై ఐదు మాత్రమే ఉన్నారని దీనికి కారణం అబార్షన్లు చేయించడమే అన్నారు.ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన దొంగచాటుగా వీటికి పాల్పడడం నేరమని హెచ్చరించారు. ఎక్కువగా గిరిజన తండాలలో అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం ఉందని వీటిని ప్రోత్సహించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు మల్లేశ్వరి,గౌసియా ఎం పి ఓ పార్థసారధి గౌడ్ పి హెచ్ సి సూపర్వైజర్ సక్రి,వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులుచైల్డ్ లైన్ ప్రతినిధులు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment